Marijuana seizure: అక్రమంగా భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తూ పట్టుబడిన 9మంది నిందితులను పాడేరు జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు కోర్టుకు తరలించారు. గురువారం లబ్బురు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించి 13 లక్షలు విలువచేసే 25 ప్యాకెట్లలోని 684 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని లక్ష్మీపురం నుంచి ఒడిశాకు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుల నుంచి జీపు, బొలెరోలతో పాటు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
లబ్బురులో భారీగా గంజాయి పట్టివేత...9మంది అరెస్ట్...కోర్టుకు తరలింపు... - 9 were arrested and produced in court at Ganja case in Labbur
Marijuana seizure: పాడేరు జిల్లాలో మరోసారి గంజాయి రవాణా గుప్పుమంది. గురువారం లబ్బురు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 684కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 13లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
Marijuana seizure