ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇత్తడి పేరుతో ఇంట్లోకెళ్లి.. మెడలోని పుత్తడి దోచేశారు! - vizag news

విశాఖలోని గాజువాకలో ఇద్దరు దొంగలు ఇత్తడి అమ్ముతామంటూ ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోని వారిపై దాడి చేసి బంగారంతో ఉడాయించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

gold robbery at vishakapatnam gajuwaka
మెడలోని పుత్తడి దోచేశారు దొంగలు

By

Published : Jun 17, 2021, 11:59 AM IST

విశాఖ గాజువాకలోని హైస్కూల్ రోడ్ లో దుండగులు రెచ్చిపోయారు. మాయమాటలతో ఓ ఇంట్లో చొరబడి.. భార్యాభర్తలపై దాడి చేశారు. బంగారు ఆభరణాలను తస్కరించారు. ఇత్తడి అమ్మడానికి వచ్చామన్న ఆ ఇద్దరు.. ఒక్కసారిగా ఇంట్లోని వారిపై దాడి చేశారు. వారి మెడలోని సుమారు 4 తులాల బంగారాన్ని అపహరించి పరారయ్యారు.

ఈ దాడిలో గాయపడిన మహిళను చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గాజువాక క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details