ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GITAM university: మహాత్ముని మాట.. ఆచరించే ఈ చోట !!

GITAM university: విశాఖలోని ‘గీతం’ విశ్వవిద్యాలయంలో గాంధీ ఆశయాలు విద్యార్థులకు తెలియజేయాలనే అభిలాష అడుగడుగునా కనిపిస్తుంది. గాంధీజీని అమితంగా అభిమానించే ‘గీతం’ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి తన విద్యాసంస్థల పేరులోనే గాంధీ నామం చేర్చి ‘గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌’(గీతం)ను 1980లో ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే అతిథిలతో ముందుగా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించే సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

geetham university
మహాత్ముని మాట

By

Published : Aug 11, 2022, 7:25 AM IST

Updated : Aug 11, 2022, 3:16 PM IST

GITAM university: విశాఖలోని ‘గీతం’ విశ్వవిద్యాలయంలో గాంధీ ఆశయాలు విద్యార్థులకు తెలియజేయాలనే అభిలాష అడుగడుగునా కనిపిస్తుంది. గాంధీజీని అమితంగా అభిమానించే ‘గీతం’ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి తన విద్యాసంస్థల పేరులోనే గాంధీ నామం చేర్చి ‘గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌’(గీతం)ను 1980లో ఏర్పాటు చేశారు. అలా మహాత్మునిపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విద్యా సంస్థ ప్రస్తుతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్థాయికి ఎదిగింది. ఇక్కడికి వచ్చే అతిథిలతో ముందుగా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించే సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

* విద్యార్థులు గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు, విలువలకు ప్రభావితులవ్వాలన్న లక్ష్యంతో మూడు గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
* గాంధీజీ స్వచ్ఛతకు, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ క్రమంలో ఈ విశ్వవిద్యాలయాన్ని అత్యంత పరిశుభ్రంగా నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రకృతిని పరిరక్షించాలని, మొక్కలను పెంచాలనే గాంధీ తత్వానికి అనుగుణంగా గీతంలో ప్రత్యేకంగా ఒక ‘ఉద్యానవన’ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడి ఖాళీ ప్రదేశాల్లో ఒక క్రమపద్ధతిలో మొక్కలు పెంచారు. అవన్నీ ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

మ్యూజియంలో కొలువైన గాంధీజీ జీవిత ప్రస్థానానికి సంబంధించిన చిత్రాలు

* గాంధీ జీవన ప్రస్థానంలో ప్రధాన సంఘటనలకు సంబంధించిన ఫొటోలతో ప్రత్యేకంగా ఒక మ్యూజియం నిర్వహిస్తున్నారు. నూలు వడికే మగ్గాలు, ప్రయాణంలో సైతం నూలు వడకడానికి ఆ రోజుల్లో ఉపయోగించిన మినీ మగ్గం కూడా ఇందులో కొలువుతీరింది.
* గాంధీజీ ఆశయాల్ని వ్యాప్తి చేయాలన్న లక్ష్యంతో ‘గాంధీ అధ్యయన కేంద్రం’ను కూడా ఏర్పాటు చేశారు. గాంధీజీకి సంబంధించిన అంశాలపై పరిశోధన చేసిన ఆచార్య డాక్టర్‌ ఎ.శశికళతో ఇక్కడ బోధన చేయిస్తున్నారు. ఆరు సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు.
* గాంధీ మ్యూజియం, అధ్యయన కేంద్రం ఉండే భవనానికి కూడా గాంధీజీ ప్రవచించే ‘సర్వోదయ’ నినాదం గుర్తుచేసేలా ‘సర్వోదయ సౌధ’గా నామకరణం చేశారు.
* గాంధీజీపై ఎంతోమంది పుస్తకాలు రాశారు. అలాంటి దాదాపు రెండు వేల పుస్తకాలతో ఒక ప్రత్యేక లైబ్రరీని కూడా నిర్వహిస్తున్నారు. ప్రముఖులు రాసిన వ్యాసాలనూ అందుబాటులో ఉంచారు.
* గాంధీజీకి సంబంధించిన పరిశోధన పత్రాల రచనకు వీలుగా ఒక అంతర్జాతీయ జర్నల్‌ను కూడా గీతం నిర్వహిస్తోంది. ఆరునెలలకు ఒకటి చొప్పున ప్రచురించే కార్యక్రమాన్ని మూడేళ్లుగా నిర్వహిస్తున్నారు.
* ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులందరూ గాంధీజీకి సంబంధించిన కోర్సును కూడా పూర్తిచేయడం తప్పనిసరి చేశారు. ఇందుకోసం గాంధీజీ జీవిత విశేషాలు, వీడియోలు, ఇతర సమాచారం విద్యార్థులందరికీ అందుబాటులో ఉంచారు. కోర్సులు పూర్తిచేసి వెళ్లే వారికి గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చే సంప్రదాయం కొనసాగిస్తున్నారు.

మహాత్ముడంటే ఎనలేని అభిమానం: గీతం వ్యవస్థాపకులు, మా తాత ఎం.వి.వి.ఎస్‌.మూర్తికి గాంధీజీ అంటే ఎనలేని అభిమానం. విశ్వవిద్యాలయ నిర్వహణలో గాంధీజీ సిద్ధాంతాల అమలు పలు అంశాల్లో కనిపిస్తుంటుంది. గాంధీజీ విగ్రహాలు, మ్యూజియం, అధ్యయన కేంద్రం ఏర్పాటు, కోర్సుల నిర్వహణ తదితరాలన్నీ అలా కొనసాగుతున్నవే. మహాత్ముని ఆశయాల్ని మరింతగా వ్యాప్తి చేయాలన్నదే లక్ష్యం.- ఎం.శ్రీభరత్‌, అధ్యక్షుడు, గీతం విశ్వవిద్యాలయం

మహాత్ముని మాట

ఇవీ చదవండి:

Last Updated : Aug 11, 2022, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details