ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిపై జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించిన తెదేపా ఎమ్మెల్యే - విశాఖ రాజధానిపై గంటా వ్యాఖ్యలు

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ.. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అందరి ఆశలు, ఆకాంక్షలని నెరవేర్చే నగరంగా విశాఖ మారతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

ganta on vizag capital
గంటా శ్రీనివాసరావు

By

Published : Dec 18, 2019, 11:27 AM IST

విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ.. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని తెలుగుదేశం నేత, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సహజసిద్ధమైన సముద్రతీరం కలిగిన విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయమన్నారు. రోడ్డు, రైలు, గాలి, నీరు అనుసంధానంతో అందరి ఆశలు, ఆకాంక్షలని నెరవేర్చే నగరంగా మారతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమని చెప్పారు. తమ సహకారాన్ని అందించేందుకు విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

గంటా శ్రీనివాసరావు

ABOUT THE AUTHOR

...view details