Cheating: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరిట మోసపోయామంటూ.. ఆరుగురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.6లక్షల వరకు వసూలు చేసినట్లుగా తెలిపారు. బాధితులకు గవర్నమెంట్ గెజిట్, స్టాంపు, సంతకాలతో సచివాలయంలో ఉద్యోగం పేరిట దొంగ హామీ పత్రాన్ని ఇచ్చినట్లు వెల్లడించారు.
Cheating: ఉద్యోగాల పేరుతో మోసం.. లక్షల్లో టోకరా
Cheating: ఒకటి కాదు.. రెండు కాదు రోజుకో కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. మోసగాళ్లు కొత్తదారులు వెతుక్కుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో బాధితుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా.. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరిట మోసపోయామంటూ కొందరు పోలీసులను ఆశ్రయించారు.
ఉద్యోగాల పేరుతో మోసం.. లక్షల్లో టోకరా
ఏడాది దాటిపోయినా ఎటువంటి ఉద్యోగం చూపకపోవడంతో.. అనుమానమొచ్చి తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడగగా తిప్పించుకుంటున్నారు. నిందితులను విజయవాడలోని ఆటో డ్రైవర్‌ల సహాయంతో పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి:
Last Updated : Jul 17, 2022, 5:20 PM IST