సింహాచల పంచ గ్రామాల సమస్యను వైకాపా ప్రభుత్వం పక్కకు పెట్టేసిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. విశాఖ జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి, ప్రస్తుత సీఎం జగన్ పంచ గ్రామాలకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తే వైకాపా నేతలు విజయవాడలో ఓ అనామక వ్యక్తి పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని చెప్పారు.
'సింహాచలం పంచగ్రామాల సమస్యపై కమిటీల పేరుతో తాత్సారం' - విశాఖ జిల్లా వార్తలు
సింహాచల పంచ గ్రామాల సమస్యను పరిష్కరించకుండా వైకాపా ప్రభుత్వం కమిటీల పేరుతో తాత్సారం చేస్తుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. గతంలో తెదేపా ప్రభుత్వం తెచ్చిన జీవో 229ని అమలు చేయకుండా అడ్డుపడ్డారన్నారు. పంచగ్రామాల సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల 12 వేల మంది ఇబ్బంది పడుతున్నారన్నారు.
bandaru satyanarayana
ఇప్పుడు మళ్లీ కమిటీ వేసి ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారని బండారు సత్యనారాయణ విమర్శించారు. జీవో 229 అమలు చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుందనే.. ఆ జీవోను నిలిపివేశారని ఆరోపించారు. సింహాచల పంచగ్రామాల సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల 12 వేల మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. హిందూ దేవాలయాలు నాశనం చేయాలనే సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని బండారు సత్యనారాయణ ఆరోపించారు
ఇదీ చదవండి :విజయవాడ రైల్వే స్టేషన్కు కొత్త హంగులు...సిద్ధమైన ఏసీ విశ్రాంతి గదులు