Fire Accident: హీరో ఎలక్ట్రిక్ షోరూంలో అగ్ని ప్రమాదం..15 బైక్లు దగ్ధం - అగ్ని ప్రమాదం వార్తలు
17:25 December 07
హీరో ఎలక్ట్రిక్ షోరూంలో మంటలు
Fire Accident in hero showroom: విశాఖ జిల్లా గాజువాకలోని హీరో ఎలక్ట్రిక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాటరీ ఛార్జింగ్ యంత్రం వద్ద షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 15 ద్విచక్రవాహనాలు, కంప్యూటర్లు, బ్యాటరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల దాటికి భారీగా పొగ ఎగిసిపడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.20 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు షోరూం యజమాని సింహద్రి తెలిపారు.
ఇదీ చదవండి: CHEATING IN WEST GODAVARI : చిట్టీల పేరుతో మోసం...రూ.7కోట్లతో పరారీ..!