ఇప్పడు.. డేటింగ్ వెబ్సైట్లు అంటే మహా క్రేజ్. డబ్బు సంపాదించేందుకు ఆ మార్గాన్నే ఎంచుకున్నారు కోల్కతాకు చెందిన కొంతమంది యువతులు. కోల్కతాలో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. అక్కడినుంచే కార్యకలాపాలు సాగించారు. యువకులకు ఫోన్ చేయడం... మాయమాటలతో డబ్బులు వసూలు చేయడం.. ఇదే వారి పని. ఈ ముఠా విశాఖలో ఒకరి నుంచి రూ.18 లక్షలు మరొకరి నుంచి 3 లక్షలు వసూలు చేసింది. బాధితులు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే.. కోల్కతాలో డొంక కదిలింది. సీఐ గోపినాథ్ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లింది. కోల్కతాలో ఓస్లామ్ ఐటీ కంపెనీ పేరిట కార్యకలాపాలు నడిపిస్తున్నారు. 24 టెలీకాలర్లతో సహా 27 మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 3 ల్యాప్టాప్లు, 40 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో తీగ లాగితే... కోల్కతాలో డొంక కదిలింది! - విశాఖలో సైబర్ క్రైమ్ న్యూస్
మోసగాళ్లంటే ఒకప్పుడు జనాలు ఎక్కువున్న ప్రాంతాలకే పరిమితం. కానీ రోజులు మారాయి. మోసం అనే పదానికి ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ ఆన్లైన్. అదే అదునుగా... వలపు వల విసిరారు కొంతమంది యువతులు. చివరకు వాళ్ల కథ ఏమైంది? ఇంతకీ వాళ్లు ఎవరు?
cyber crime in vishaka