విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని సెంట్రల్ పార్క్, రైల్వేస్టేషన్ ఏరియాలో తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్న వారికి ఆటో స్టాండ్ కార్మికులకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నారని కొందరు తన దృష్టికి తెచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే వారికి తక్షణ సాయంగా 200 మందికి కావాల్సిన సరుకులను అందజేశామని పేర్కొన్నారు. సాయం అడిగిన వెంటనే స్పందించిన నేతకు వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 31వార్డ్ టీడీపీ కార్పొరేట్ అభ్యర్థి దొడ్డి బాపు ఆనంద్, రామానంద్, 29వార్డ్ టీడీపీ కార్పొరేట్ అభ్యర్థి బొట్టా పరదేసి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
హాకర్స్, ఆటో స్టాండ్ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ - tdp services
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని హాకర్స్ కు, ఆటో స్టాండ్ కార్మికులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందజేశారు.
హాకర్స్ కు, ఆటో స్టాండ్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి