విశాఖకు చెందిన 'ఇమాజిన్ టు ఇన్నోవేట్' అనే సంస్థ నిర్వహించిన ఈ-బైక్ సీజన్ -3 వేడుకలు ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలకు పదునుపెట్టాయి. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు అనేక బృందాలుగా ఏర్పడి వివిధ ఆవిష్కరణలకు రూపమిచ్చారు. ఈ-బైక్‌లు, గోకార్ట్లు తీర్చిదిద్దారు. రఘు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమం అయిదు రోజుల పాటు సందడిగా సాగింది. విద్యార్థులు రూపొందించిన వాహనాలకు నిర్వాహకులు ఏర్పాటు చేసిన పోటీలు యువతలో స్ఫూర్తి నింపడమే కాకుండా ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.
ప్రమాదానికి గురైతే క్షణాల్లో బంధువులకు మెసేజ్
చిత్తూరు జిల్లా మదనపల్లి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ బైక్, గో కార్టింగ్ పోటీలకు విశాఖపట్నం వచ్చారు. తాము రూపొందించిన వినూత్న ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు.
ఈ-బైక్ ప్రత్యేకతలు ఏంటి?
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఉండే చిప్ వినియోగించి మాత్రమే ఈ వాహనాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంటుందని టీం లీడర్ మోహన్ తెలిపారు. దీని వల్ల వాహన చోరీని నివారించవచ్చన్నారు. అదేవిధంగా ప్రత్యేక డిటెక్షన్ సెన్సార్లను ఇందులో పొందుపరిచారు. దీని వల్ల వాహనం ఎక్కడైనా ఒరిగితే, వెంటనే బంధువులకు, అంబులెన్సు వంటి వ్యవస్థలకు మెసేజ్‌పంపి అప్రమత్తం చేసే ఏర్పాట్లు చేశారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సంకేతాలు వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి. 2 నెలలపాటు ఈ బృందం కష్టపడి ఈ-బైక్‌ను లక్షా 10 వేల రూపాయల వ్యయంతో తయారుచేశారు. రానున్న కాలంలో ఈ వాహనాన్ని వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేసేందుకు వీరు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఆటోమొబైల్ రంగంలో నూతన ఒరవడి సృష్టించడమే లక్ష్యంగా దూసుకుపోతున్న యువ ఇంజినీర్ల ప్రతిభకు ఈ వేదిక పట్టం కట్టింది. రఘు కళాశాల ఎదురుగా ఉన్న ఫార్చూన్ హిల్స్ రహదారులపై ల్యాప్‌లు ఏర్పాటు చేశారు. తాము తీర్చిదిద్దిన వాహనాలతో పోటీపడ్డారు. పర్యావరణహితమైన వాహనాలతో కొత్తరూపు, ఆవిష్కరణలు తీసుకువస్తామని విద్యార్థులు చెబుతున్నారు.
విశాఖలో ముగిసిన ఈ-బైక్, గోకార్ట్ల సందడి - విశాఖలో ముగిసిన ఈ-బైక్, గోకార్ట్ల సందడి
రయ్ రయ్ మంటూ దూసుకుపోయే కార్ట్ లు ఓవైపు.. చప్పుడు లేకుండా సర్రున పరుగులు పెట్టే బైక్ లు మరోవైపు. విద్యార్థుల్లో పర్యావరణహిత వాహనాలపై ఆసక్తిని పెంచడం... వాహనాల తయారీ నైపుణ్యంపై మెలకువలకు పదును పెట్టడమే లక్ష్యంగా జరిగిన ఈ-బైక్ ఉత్సవ్ యువతలో నూతనోత్సాహాన్ని తెచ్చింది. అయిదు రోజుల పాటు వేడకగా జరిగిన పోటీలు ఆదివారంతో ముగిశాయి.
విశాఖలో ముగిసిన ఈ-బైక్, గోకార్ట్ల సందడి
ఇదీ చదవండి :