బుధవారం విశాఖ సాగరతీరాన జరగనున్న నౌకాదళ దినోత్సవం వివరాలను... నేవల్ డాక్ యార్డులోని యుద్ధ నౌక ఐఎన్ఎస్ జలశ్వాపై అతుల్ కుమార్ జైన్ వెల్లడించారు. సాంకేతికత, ఆయుధ సంపత్తి, నౌకల సంఖ్య వంటి అంశాల్లో నౌకాదళం ఎంతో అభివృద్ధి సాధించిందని జైన్ తెలిపారు. వివిధ దేశాలతో, ముఖ్యంగా పొరుగు దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త విన్యాసాలు విషయంలో ముందుంటున్న విషయాన్ని వివరించారు.
'మిలాన్' నేవీ విన్యాసాలకు 41 దేశాలకు ఆహ్వానం - అతుల్ కుమార్ జైన్ న్యూస్
వచ్చే ఏడాది మార్చి నెలలో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న 'మిలాన్' నేవీ విన్యాసాలకు... 41 దేశాలను ఆహ్వానించినట్లు ఈఎన్సీ అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ వెల్లడించారు.
మిగ్ 29 స్క్వాడ్రన్ విశాఖలో ఏర్పడనుందన్న ఆయన... విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ వచ్చే వరకూ ఇది మిగ్ శిక్షణ కేంద్రంగా కొనసాగుతుందని చెప్పారు. ఏడు కొత్త నౌకలు భారత నౌకాదళంలోకి ప్రవేశించనున్నాయని తెలిపారు. సముద్రమార్గం నుంచి దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించి విధ్వంసాలు సృష్టించేందుకు ఉన్న అవకాశాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అరికడుతున్నామన్నారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్ట భద్రత అమలు చేస్తున్నట్లు జైన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:నేవీ డే ప్రచార చిత్రం.. చూసి తీరాల్సిందే!