విశాఖ జిల్లా గాజువాక మండలం మిందిలో ప్రజలను కుక్కలు భయపెడుతున్నాయి. 65వ వార్డువాసులు బయట తిరగాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కుక్కల దాడిలో 9మంది గాయపడ్డారు. ఏ అవసరం ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే.. కుక్కకాటుకు గురికావాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటి అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.
బాబోయ్ కుక్కలు.. భయాందోళనలో ప్రజలు
గాజువాక మండలంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. 65వ వార్డులో తిరగాలంటేనే స్థానికులు భయపడిపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆ ఊరిలో కుక్కలున్నాయి జాగ్రత్త