ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్టీపీసీలో రూ.870కోట్లతో డీసల్ఫరైజేషన్‌ ప్లాంట్‌

విశాఖలోని ఎన్టీపీసీ సింహాద్రి సంస్థ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా డీసల్ఫరైజేషన్‌ ప్లాంటును నిర్మిస్తున్నారు. ఇప్పటికే సుమారు 50శాతం నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. డీసల్ఫరైజేషన్‌ ప్రక్రియ కారణంగా జిప్సం తయారవుతుంది. దీన్ని సిమెంటు తయారీకి ఉపయోగించవచ్చు.

Desulfurisation plant at NTPC
ఎన్టీపీసీలో డీసల్ఫరైజేషన్‌ ప్లాంట్‌

By

Published : Oct 23, 2020, 6:14 PM IST

విశాఖలోని ఎన్టీపీసీ సింహాద్రి సంస్థ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా రూ.870 కోట్లతో భారీ డీసల్ఫరైజేషన్‌ ప్లాంటును నిర్మిస్తోంది. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్లూగ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌ ప్లాంట్లు(ఎఫ్‌.జి.డి.) ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఎన్టీపీసీ సంస్థ గత సంవత్సరం అక్టోబర్‌లో భారీ ఎఫ్‌.జి.డి నిర్మాణానికి పనులు ప్రారంభించింది. ఇప్పటికే సుమారు 50శాతం నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి.

వాస్తవానికి ఈ ఏడాదే ఆ ప్లాంటు అందుబాటులోకి రావాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా నిర్మాణం ఆలస్యం అయ్యింది. మళ్లీ ఆయా పనులు వేగం పుంజుకోవటంతో వచ్చే సంవత్సరం సెప్టెంబరు నెలాఖరు కల్లా పూర్తికానుంది. ఆ ప్లాంటును అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం 2022వ సంవత్సరం వరకు గడువిచ్చింది. ఎఫ్‌.జి.డి. నిర్మాణంతో సల్ఫర్‌డయాకైడ్‌ విడుదల ఏకంగా 80 శాతానికి పైగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. డీసల్ఫరైజేషన్‌ ప్రక్రియ కారణంగా జిప్సం తయారవుతుంది. దీన్ని సిమెంటు తయారీకి ఉపయోగించవచ్చు.

ఇదీ చదవండి: జై అమరావతి’ నినాదాలతో హోరెత్తిన రాజధాని శంకుస్థాపన ప్రాంతం

ABOUT THE AUTHOR

...view details