ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తూర్పు కోస్తా పరిధిలో రోజువారీ రైళ్లు ప్రారంభం

తూర్పుకోస్తా రైల్వే తన పరిధిలోని కొన్ని రైళ్లను రోజువారీగా నడపాలని నిర్ణయించింది. విశాఖ-రాయగడ మధ్య ప్రత్యేక రైలును ప్రతిరోజు నడుపుతారు. పలాస-విశాఖ మధ్య డైలీ ప్రత్యేక ఎక్స్​ప్రెస్ రైలు నడుస్తుంది. భువనేశ్వర్-పలాస మధ్య మరో ప్రత్యేక డైలీ రైలు నడుపుతారు. రాయగడ- సంబల్​పూర్ మధ్య మరో పత్యేక డైలీ ఎక్స్​ప్రెస్ రైలు నడవనుంది. ప్రయాణికులంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Daily trains start in East Coast region..!
Daily trains start in East Coast region..!

By

Published : Nov 11, 2020, 10:22 PM IST

ఈనెల 15 నుంచి తూర్పుకోస్తా రైల్వే తన పరిధిలోని కొన్ని రైళ్లను రోజువారీగా నడపాలని నిర్ణయించింది. విశాఖ-రాయగడ మధ్య ప్రత్యేక రైలును ప్రతిరోజు నడుపుతారు. సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు విశాఖలో బయలుదేరి, రాత్రి తొమ్మిది గంటలకు రాయగడ చేరుతుంది. రాయగడలో ఉదయం ఐదుగంటల 15 నిమిషాలకు బయలుదేరి తొమ్మిదిన్నరకు విశాఖ చేరుకుంటుంది. సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురంటౌన్ స్టేషన్లలో ఈ రైలు అగుతుంది.

పలాస-విశాఖ మధ్య డైలీ ప్రత్యేక ఎక్స్​ప్రెస్ రైలు నడుస్తుంది. ఈ రైలు విశాఖలో సాయంత్రం ఆరున్నరకు బయలుదేరి పలాసకు రాత్రి 11.30 గంటలకు చేరుతుంది. పలాసలో ఉదయం 5.25కి బయలుదేరి ఉదయం 10 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, నౌపడ స్టేషన్లలో ఆగుతుంది.

భువనేశ్వర్-పలాస మధ్య మరో ప్రత్యేక డైలీ రైలు నడుపుతారు. ఇది భువనేశ్వర్​లో సాయంత్రం ఆరుగంటల 20 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10.40కి పలాస చేరుతుంది. పలాసలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి పది గంటల పది నిమిషాలకు భువనేశ్వర్ చేరుతుంది. ఈ రైలు సొంపేట, ఇచ్ఛాపురం, బ్రహ్మపూర్, ఛత్రపూర్, కళ్లికోట్, బౌల్గాన్, కాలుపరాఘాట్, నిరాకార్ పూర్, ఖుర్డారోడ్ స్టేషన్లలో ఆగుతుంది.

రాయగడ-సంబల్​పూర్ మధ్య మరో పత్యేక డైలీ ఎక్స్​ప్రెస్ రైలు నడవనుంది. ఉదయం ఆరు గంటలకు సంబల్​పూర్​లో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు రాయగడ చేరుతుంది. రాయగడలో మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి.. రాత్రి ఎనిమిది గంటల 20 నిమిషాలకు సంబల్​పూర్ చేరుతుంది. హిరాకుడ్, అట్టబైర, బార్గారోడ్, బార్పలి, లొసింగ, బలంగీర్, సైంతాలా, బాడ్మల్, టిట్లాఘర్, కెసింగ, రూప్రరోడ్, నార్లరోడ్, లాంజిగర్ రోడ్, అంబదల, మునిగుడ, తిరుబలి, సింగపూర్ రోడ్ స్టేషన్లలో ఈ రైలు అగుతుంది. ప్రయాణికులంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండీ... రాష్ట్రంపై తగ్గుతున్న కొవిడ్ ప్రభావం.. తాజాగా 1732 కేసులు

ABOUT THE AUTHOR

...view details