'జీతేగా యా జీతేగా...ఇండియా జీతేగా' అంటూ ప్రపంచ కప్‌లో ఇండియానే గెలవాలని సగటు అభిమాని ఆకాంక్ష. ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లో ప్రవేశించాలని ఉరకలేస్తున్న టీం ఇండియాకు మద్దతుగా... ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిమానం చాటుకుంటారు. అలాంటి ప్రయత్నమే చేశాడు ఈ వైజాగ్ చిన్నోడు.
అభిమానం అదిరింది... తలపై వరల్డ్‌కప్!
నేడు న్యూజిలాండ్‌తో జరగనున్న క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలవాలని ఆకాంక్షిస్తూ విశాఖపట్నంలో ఓ అభిమాని వరల్డ్ కప్ ఆకారంలో తన జుట్టును కత్తిరించుకున్నాడు.
వరల్డ్ 'హోయిర్ కట్' కప్ అభిమానం
చారిత్రాత్మక విజయానికి రెండడుగుల దూరంలో ఉన్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ తనదైన స్టైల్లో మద్దతు తెలిపాడు ఓ అభిమాని. నగరానికి చెందిన శ్రీకాంత్ తన జుట్టును ప్రపంచ కప్ నమూనాలో అలంకరించుకోవాలని భావించాడు. అదే తడవుగా ఓ హెయిర్ స్టైయిలర్ను సంప్రదించాడు. దాదాపు గంట పాటు శ్రమించి ఇదిగో ఇలా సిద్ధం చేశాడు.