ఇసుక సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. క్రెడాయ్ నూతన కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. విశాఖలో జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులకే మేలు జరుగుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
కొవిడ్, లాక్డౌన్ అనంతరం ఇతర రాష్ట్రాలు అనేక ఉపశమన చర్యలు చేపట్టాయని క్రెడాయ్ సభ్యులు గుర్తు చేశారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం సహరించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యయభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.