ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'డాక్టర్ పట్టించుకోవట్లేదు..ఆక్సిజన్ పెట్టట్లేదు..ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది'

By

Published : Jul 25, 2020, 3:32 PM IST

రాష్ట్రంలో పలు చోట్ల కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. క్వారంటైన్ కేంద్రంలో తనను పట్టించుకునే వారే లేరని విశాఖ జిల్లాలోని కరోనా బాధితుడు వీడియో ద్వారా ఆవేదన వెలిబుచ్చాడు. శ్వాస సరిగా ఆడటం లేదని... ఆక్సిజన్ పెట్టమని అడిగినా పట్టించుకునే వారు లేదంటున్నాడు.

covid patient video message
'డాక్టర్ పట్టించుకోవట్లేదు...ఆక్సిజన్ పెట్టట్లేదు...ఊపిరితీసుకోవటం కష్టంగా ఉంది'

విశాఖలోని క్వారెంటైన్ కేంద్రంలో ఉన్న మల్కాపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఈ నెల 22న కోవిడ్ పాజిటివ్​గా నిర్థరణ అయింది. అప్పటినుంచి నగరంలో పలు క్వారంటైన్ కేంద్రాలకు మార్చుతున్నారు. అయితే ఎన్ని కేంద్రాలకు మార్చినా వైద్యసేవలు మాత్రం అందటం లేదని వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. ఛాతి నొప్పితో బాధపడుతూ ఊపిరి అందని పరిస్థితిల్లో ఉన్నా తనకు ఆక్సిజన్ సైతం పెట్టడం లేదంటున్నాడు. తక్షణమే అధికారులు స్పందించి తనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వేడుకుంటున్నాడు.

'డాక్టర్ పట్టించుకోవట్లేదు...ఆక్సిజన్ పెట్టట్లేదు...ఊపిరితీసుకోవటం కష్టంగా ఉంది'

ఇవీ చూడండి-'ప్రజల్లో రావాలి చైతన్యం.. లేకుంటే సంక్షోభం తీవ్రతరం'

ABOUT THE AUTHOR

...view details