ప్రపంచ వ్యాప్తంగా భయపడుతున్న కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దిల్లీలోని జాతీయ అంటువ్యాధులు నివారణ సంస్థ నుంచి ముగ్గురు వైద్య బృందం విశాఖ చేరుకుంది. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షికా వర్ధన్ నేతృత్వంలో విశాఖలో మూడు రోజులు పాటు ఈ బృందం పర్యటించనుంది. సోమవారం రాత్రి విశాఖ విమానాశ్రయంలో ఈ బృందానికి జిల్లా వైద్య అధికారులు స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టులో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలను బృందం పరిశీలించింది. విదేశీ ప్రయాణికులను పరీక్షిస్తున్న విధానాలు పరిశీలించారు. నేడు, రేపు వివిధ వైద్య సంస్థలను బృంద సభ్యులు పరిశీలిస్తారు. విశాఖలో పారిశుద్ధ్యం ఇతర అంశాలు మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో చైతన్యం, అవగాహన వల్ల ఈ వైరస్ బారిన పడకుండా చేయగలమని పేర్కొన్నారు. విమానాశ్రయంలో కరోనా వైరస్ పరీక్షా కేంద్రం, రెండు అంబులెన్సులు నిరంతరం ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న ప్రయాణికులను కేజీహెచ్‌కు తరలించి తగిన వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేసినట్టు విశాఖ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
విశాఖలో కరోనా వైరస్ నివారణ పరిశీలన బృందం పర్యటన - vizag airport latest news
కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా... జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థకు చెందిన వైద్యబృందం విశాఖ చేరుకుంది. మూడు రోజుల పాటు నగరంలో పర్యటించనున్న బృందం...నగరంలోని వివిధ వైద్య సంస్థలను పరిశీలించనుంది.
విశాఖ చేరుకున్న కరోనా వైరస్ నివారణ పరిశీలన బృందం