ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో తీరంలో పర్యాటకుల భద్రత కోసం రంగంలోకి రోబోటిక్ బోట్‌ - సాగరతీరంలో రోబోటిక్ గస్తి

Robotic boat విశాఖ సాగర తీరానికి కొత్త అతిథి వచ్చింది. విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్‌గా రూపుదిద్దే కార్యక్రమంలో భాగంగా, ఆర్​కే బీచ్ వద్ద బ్యాటరీ సహాయంతో పనిచేసే లైఫ్ బాయ్ అనే రోబోటిక్ బోట్‌ ను ప్రవేశపెట్టారు. ఇది సముద్రంలో 700 మీటర్ల వరకు గల్లంతైన వారిని రక్షిస్తుందని, అధికారులు చెబుతున్నారు. ఈ బోట్ పనితీరును కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు.

remote rescuing lifebuoy off the coast
రోబోటిక్ బోట్‌తో రక్షణ

By

Published : Sep 10, 2022, 3:27 PM IST

Robotic boat in Vishaka విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్ గా మార్చేందుకు..కొత్త అతిథి అందుబాటులోకి వచ్చింది. సాగర తీరంలో గల్లంతైన వారిని రక్షించేందుకు అధికారులు రోబోటిక్ బోట్ అనే కొత్త తరహా బోట్​ను ప్రవేశపెట్టారు. సముద్రంలో ఎవరైనా గల్లంతైతే, ఈ బోట్ రంగంలోకి దిగుతుందని.. సముద్రంలో 700 మీటర్ల వరకు వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. గంటకు 7 కి. మీ వేగంతో నడిచే ఈ బోట్ పనితీరును జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు. ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. దీనిని లైఫ్ బాయ్ అని పిలుస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన విశాఖ సాగర తీరంలో నిత్యం పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నందున వారి భద్రతకు తగు చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగానే ఈ లైఫ్ బాయ్ అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు.

తీరు ప్రాంతాన్ని పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా, జీవీఎంసీ సహకారంతో 39 మంది గజ ఈతగాళ్లతోపాటుగా, బీచ్​లో వారికి కావలసిన లైఫ్ జాకెట్లు ఇతర సామగ్రిని సమకూర్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమం అనంతరం జీవీఎంసీ మేయర్, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ తీరంలో గల స్థానిక దుకాణదారుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్ , ప్లాస్టిక్ స్పూన్స్ వంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని , ప్రోత్సహించవద్దని తెలిపారు. వీటి వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ఎవరైనా అక్రమంగా వినియోగించినట్లయితే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని కోరారు.

విశాఖలో తీరంలో పర్యాటకుల భద్రత కోసం రంగంలోకి రోబోటిక్ బోట్‌

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details