ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల 4న విశాఖకు సీఎం​.. నేవీడే కార్యక్రమానికి హాజరు - నేవీ డే సీఎం జగన్ టూర్ న్యూస్

ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి విశాఖకు వెళ్లనున్నారు. నేవీ డే సందర్భంగా నౌకదళ విన్యాసాలను వీక్షించనున్నారు.

cm jagan tour in vishaka
cm jagan tour in vishaka

By

Published : Dec 2, 2019, 7:47 PM IST

నేవీ డే సందర్భంగా ఈనెల 4న విశాఖకు సీఎం జగన్ వెళ్లనున్నారు. డిసెంబర్ 4 మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖ చేరుకుని, నేరుగా ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్తారు. 4 గంటలకు నౌకాదళ విన్యాసాలకు వేదికైన ఆర్కే బీచ్​కు చేరుకుంటారు. తూర్పు నౌకాదళం ప్రదర్శించే విన్యాసాలను దాదాపు గంటన్నర సేపు వీక్షిస్తారు. 5.30 తిరిగి ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి నివాస ప్రాంగణం నేవీ హౌస్​లో 'ఎట్ హోం' కార్యక్రమానికి హాజరవుతారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు తిరిగి విజయవాడ పయనమవుతారు.

ABOUT THE AUTHOR

...view details