చంద్రబాబు విశాఖలో అబద్ధాలు మాట్లాడారని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో నగర మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని స్పష్టం చేశారు. సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. పంచగ్రామాల్లో భూ సమస్య తమ ప్రభుత్వ హయాంలోనే పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే కోర్టు తీర్పు ఆధారంగా న్యాయం చేస్తామని మంత్రి వివరించారు.
చంద్రబాబు విశాఖలో అబద్ధాలు మాట్లాడారు: అవంతి - Avanti comments on CBN
మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి... వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.
అవంతి శ్రీనివాసరావు