FRAUD: నలుగురితో పెళ్లి.. మరొకరితో వివాహానికి సిద్ధం - ccrb-head-constable-appalaraju
12:52 October 04
విశాఖలో వెలుగులోకి వచ్చిన నిత్య పెళ్లికొడుకు నిర్వాకాలు
విశాఖలో నిత్య పెళ్లికొడుకు నిర్వాకాలు వెలుగులోకి వచ్చాయి. 4 పెళ్లిళ్లు(four marriages) చేసుకున్న సీసీఆర్‌బీ హెడ్ కానిస్టేబుల్(CCRB head constable).. అయిదో పెళ్లికి సిద్ధపడటంతో మొదటి భార్య మహిళా చేతన సంస్థను ఆశ్రయించింది. వారి సహకారంతో దిశ పోలీస్ స్టేషన్(Disha police station)లో ఫిర్యాదు చేసింది.
విశాఖ సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అప్పలరాజు.. నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని, ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య పద్మ మహిళా చేతనను ఆశ్రయించారు. ప్రెస్‌క్లబ్‌లో బాధితురాలు సమావేశం నిర్వహించి.. వివరాలు వెల్లడించారు. అయిదో పెళ్లికి సిద్ధమైన అప్పలరాజును నిలదీయడంతో తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె వాపోయారు. తనకు నాలుగుసార్లు గర్భస్రావం చేయించాడని కన్నీటిపర్యంతమయ్యారు. మహిళా చేతన అండతో దిశా పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్ అప్పలరాజుపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. అప్పలరాజును తక్షణమే విధుల నుంచి తొలిగించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.