విజయమ్మను ఓడించారు కాబట్టే హుద్‌హుద్ తుపాను వచ్చింది అంటూ... విశాఖ వాసులపై విషం కక్కిన విజయసాయి ఇప్పుడు ప్రేమ కురిపించడం ఆశ్చర్యంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.
వైకాపా ప్రేమ విశాఖ భూములపై మాత్రమేనని అక్కడి ప్రజలకు స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. విశాఖని రియల్ దందాకి అడ్డాగా మార్చుకొని అడ్డంగా దొరికిపోయిన తర్వాత తనకు సంబంధం లేదు అన్నంత మాత్రాన.. వందెకరాల బంధం పోతుందా అని నిలదీశారు.