సాగర తీరాన రక్తదాన అవగాహన నడక - visakhapatnam
'రక్తదానం చెయ్యండి ప్రాణదాతలుకండి' అనే నినాదంతో విశాఖ బీచ్ రోడ్డులో రక్తదాన అవగాహన నడకను నిర్వహించారు.
సాగర తీరాన రక్తదాన అవగాహన నడక
బీచ్ రోడ్ కాళీమాత ఆలయం వద్ద శ్రీరామ్ చిట్స్, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన నడకను నిర్వహించారు. ఈ వేసవిలో రక్తదానం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని.. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే రక్త నిల్వలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రతిఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈ నడక ద్వారా వారికి అవగాహన కల్పిస్తున్నామని వారు తెలిపారు.