ప్రభుత్వం పని తీరు చూస్తుంటే.. సీఎం జగన్‌కు సరైన సలహాదారులు లేరనిపిస్తోందని భాజపా నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ప్రజావేదికను ఒక్కరోజులో కూల్చిన జగన్.... ఇసుక విధానంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. ఇసుక విధానంపై నిర్ణయం తీసుకోనందున లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కరోజులోనే అపాయింట్మెంట్ దొరికేదని... 70 రోజులైనా సీఎం జగన్ అపాయింట్మెంట్ లభించటం లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని.. ప్రజల్లో జగన్ గ్రాఫ్ తగ్గిపోతోందన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. అధికారులతో కుమ్మక్కయితేనే కాంట్రాక్టుల విషయంలో అవినీతి సాధ్యమని... కేవలం గుత్తేదారులనే ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటుందన్నారు. మణిపాల్ గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఛైర్మన్ మోహన్‌దాస్ పాయ్ స్పందన సీఎం తెలుసుకోవాలని సూచించారు.