ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనాథ పిల్లల మధ్య అవంతి సంబరాలు - bheemili

భీమిలీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అవంతి శ్రీనివాస్​ తన సంబరాలను ఎస్​ఓఎస్​ అనాథ పిల్లలతో జరుపుకున్నారు.

అనాథ పిల్లలతో అవంతి సంబరాలు

By

Published : May 24, 2019, 1:10 PM IST

భీమిలి శాసనసభ్యుడిగా ఎన్నికైన అవంతి శ్రీనివాస్ ప్రజాసమస్యలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. భీమిలి శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక ఖరారయ్యాక భీమిలి నియోజకవర్గంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. ఇవాళ ఉదయం భీమిలిలోని శ్రీ నూకాలమ్మ ఆలయంలో ముత్తంశెట్టి శ్రీనివాస్​ పూజలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ భీమిలిలోని ఎస్ఓఎస్ అనాథ బాలికల ఆశ్రమం పిల్లలతో సమావేశమయ్యారు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న ఎస్​ఓఎస్ విలేజ్​కు సహాయ సహకారాలు అందిస్తానని అవంతి తెలిపారు.

అనాథ పిల్లలతో అవంతి సంబరాలు

ABOUT THE AUTHOR

...view details