ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖలో 32 వేల ఎకరాలపై వైకాపా నేతల కన్ను'

ల్యాండ్ పూలింగ్ పేరుతో విశాఖలో పేదల భూమిని వైకాపా నేతలు కబ్జా చేస్తున్నారని... తెదేపా అధికార ప్రతినిధి అనురాధ ఆరోపించారు. విశాఖలో వైకాపా నేతల భూకబ్జాలపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

Anuradha
Anuradha

By

Published : Jan 30, 2020, 4:43 PM IST

మీడియా సమావేశంలో పంచుమర్తి అనురాధ

జీవో నంబరు 72 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వేలాది ఎకరాల అసైన్డ్‌ భూమిని కొట్టేయాలని... వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని తెదేపా నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఎంతో పేరు గల వాల్తేరు క్లబ్‌ను కూడా వైకాపా నేతలు వదలడం లేదన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ తంతు నడుస్తుందని ఆమె ఆరోపించారు. 32 వేల ఎకరాల భూమిపై వైకాపా నేతల కన్ను పడిందన్నారు. 7 నెలల్లో 1,800 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా చేశారని అనురాధ ఆరోపించారు. సింహాచలం దారిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. భూదందాపై సీబీఐ విచారణ చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ను డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:'మేము క్షేమంగా ఉన్నాం : చైనాలో తెలుగు విద్యార్థుల సెల్ఫీ వీడియో'

ABOUT THE AUTHOR

...view details