"విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు వచ్చే అవకాశముంది" - vikram lander
చంద్రయాన్ ప్రయోగం విఫలమైనట్లు కాదని... విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్య ఎస్. వి. ఎస్. ఎస్. రామకృష్ణ.
చంద్రయాన్ 2 లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇస్రో శాస్త్రవేత్తల కష్టం వృథాగా పోదని అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధ్యాపకుడు, వాతావరణ శాస్త్ర నిపుణుడు ఆచార్య నిపుణుడు ఆచార్య ఎస్. వి. ఎస్. ఎస్. రామకృష్ణ. చంద్రయాన్ 2 ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్త కష్ట ఫలమని, మిగతా దేశాలతో పోల్చితే మన ఇస్రో తక్కువ ఖర్చుతో ప్రయోగం చేసిందని ప్రశంసిస్తున్నారు. ప్రధానంగా చంద్రుడిపై వాతావరణ పరిస్థితులు, ఊహించని పరిణామం వల్లే తుది ఫలితం అందుకోలేకపోయామని అంచనా వేస్తున్నారు. ఐతే కొద్దీ రోజుల్లోనే ల్యాండర్ నుంచి సంకేతాలు వచ్చే అవకాశం లేకపోలేదని... గతంలో చంద్రయాన్ మొదటి ప్రయోగంలో కుడా అలాంటి తరహా ఫలితం వచ్చిందని ఆచార్య రామకృష్ణ పేర్కొన్నారు.