ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా 'అదానీ'కి - గంగవరం పోర్టు తాజా వార్తలు

గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను కూడా అదానీకి విక్రయించనున్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.645.10 కోట్లు సమకూరనుంది.

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా 'అదానీ'కి
గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా 'అదానీ'కి

By

Published : May 6, 2021, 4:54 AM IST

గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4% వాటాను కూడా అదానీకి విక్రయించనున్నారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే పోర్టులో 89.6% వాటాను అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) సొంతం చేసుకున్న విషయం విదితమే. తాజాగా ప్రభుత్వ వాటా విక్రయంతో ఈ పోర్టు పూర్తిగా అదానీ చేతికి వెళుతుంది. గతంలో విండీ లేక్‌సైడ్‌ నుంచి అదానీ కొనుగోలు చేసిన 31.5% వాటా కింద 16.28 కోట్ల వాటాల బదిలీకి కూడా ఆమోదం లభించింది. పోర్టు వ్యాపార సామర్థ్యం 50 మిలియన్‌ టన్నుల వరకు ఉన్నా.. ఏటా 32-35 మిలియన్‌ టన్నులు మాత్రమే జరుగుతోంది. దీనివల్ల ఏటా రూ.22 కోట్లు డివిడెండ్‌ రూపేణా ప్రభుత్వానికి సమకూరుతుంది.

ABOUT THE AUTHOR

...view details