విశాఖ నగరంలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. అత్యవసరమైతే తప్ప.. ప్రజలెవరూ బయటకు రాకుండా అధికారులు పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి చర్యలు, పరీక్షల తీరు, నిత్యావసరాల సరఫరాపై పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి సారించారు.
విశాఖలో పటిష్టంగా లాక్డౌన్ అమలు - విశాఖలో లాక్డౌన్ ప్రభావం
కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్డౌన్ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. విశాఖలో నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చేవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
విశాఖలో లాక్డౌన్ పరిస్థితిని వివరిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్