అఖిల భారత రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) బాక్సింగ్, వెయిట్ లిప్టింగ్ పోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి (గురువారం, సెప్టెంబరు 5) ఆరు రోజుల పాటు.. నగరంలోని రైల్వే క్రీడా మైదానంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్లో 8 రైల్వే జోన్ల నుంచి 42 మంది ఆర్పీఎఫ్ బాక్సింగ్, వెయిట్ లిఫ్టంగ్ క్రీడాకారులు పాల్గొనున్నారు. 55 నుంచి 100 కిలోల విభాగాల్లో వెయిట్ లిప్టింగ్ పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
విశాఖలో ఆర్పీఎఫ్ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ - vizag
రైల్వే రక్షక దళం ఆధ్వర్యంలో బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. విశాఖలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో 8 రైల్వే జోన్ల నుంచి వచ్చిన 42 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.
విశాఖలో ఆర్పీఎఫ్ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్