ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేకే లైన్​లో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం - వైజాగ్ వార్తలు

విశాఖ జిల్లాలోని కేకే లైన్‌లో పడిన కొండచరియల తొలగింపు పనులను అధికారులు ముమ్మరం చేశారు. అదే విధంగా ట్రాక్ మరమ్మతు పనులు కూడా వేగవంతం చేశామని రైల్వే అధికారులు తెలిపారు.

Acceleration of landslide removal works in KK line
బొర్ర-చిమిడిపల్లి రైల్వే ట్రాక్

By

Published : Jun 7, 2020, 8:59 PM IST

కొత్తవలస - కిరండల్ రైలు మార్గంలోని బొర్ర - చిమిడిపల్లి రైల్వే స్టేషన్​ల నడుమ రైల్వే ట్రాక్​పై కొండ చరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించి... ట్రాక్​ పునరుద్ధరణ పనులను అధికారులు చేపట్టారు. గతంలో పనులు చేస్తుండగా ఇద్దరు కూలీలు మృతి చెందారు.

ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేసీబీలతో ట్రాక్​పై పడిన బండరాళ్లను తొలగిస్తున్నారు. రెండు రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details