- నర్సీపట్నంలో ఉద్రిక్తత.. రోడ్డుపై అయ్యన్నపాత్రుడు ధర్నా
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో(Protest in narsipatnam) ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీలో వైకాపా సభ్యుల అనుచిత ప్రవర్తనకు నిరసనగా తెదేపా నేతలు చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పార్టీ నేత అయ్యన్నపాత్రుడు సహా.. నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- స్టార్మ్ పోలీసింగ్‌లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్.. సీఎం జగన్ అభినందన
రాష్ట్ర పోలీసు శాఖను సీఎం జగన్ అభినందించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించిన తెలిపిన డీజీపీ గౌతమ్ సవాంగ్.. ఉన్నాతాధికారులతో కలిసి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- devineni uma: కోటి రూపాయలు ఇస్తామన్నా.. వారు లొంగలేదు : దేవినేని ఉమ
కొండపల్లి మునిసిపల్ చైర్మన్ ఎన్నిక విషయమై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. తెదేపా కౌన్సిలర్లకు అధికార పార్టీ నేతలు డబ్బు ఆశ చూపారని ఆరోపించారు. కోటి రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారని.. అయినా వారు లొంగకుండా అధికార పార్టీకి బుద్ధి చెప్పారన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Railway Track Restore : 48 గంటల్లోనే.. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ!
విజయవాడ-చెన్నై గ్రాండ్ ట్రంక్ మార్గంలోని ముఖ్యమైన నెల్లూరు-పరుగుపాడు రైల్వే పునరుద్ధరణ(Nellore-Parugupadu railway track restored ) పనులను రికార్డు స్థాయిలో పూర్తిచేశారు. 48గంటల్లో నిర్విరామంగా పనిచేసి 1.8కిలోమీటర్ల ట్రాక్‌ను పునరుద్ధరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Cabinet meeting: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం
'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'కు (Farm laws repeal bill 2021) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే ఈ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక ప్రకటన
ఈ ఏడాది చివరినాటికి అంతర్జాతీయ విమాన సర్వీసులను(International flights india) పూర్తి స్థాయిలో పనురుద్ధరిస్తామని కేంద్రం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- China population: పెళ్లికి యువత 'నో'.. జనాభా సంక్షోభంలో చైనా!
వివాహాలు చేసుకోవడానికి చైనా యువత వెనకడుగు వేస్తోంది. తద్వారా ఆ దేశం జనాభా సంక్షోభంలో(China population crisis) చిక్కుకుపోతోంది. చైనాలో వరుసగా ఏడేళ్లపాటు వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆరంభ లాభాలు ఆవిరి- సెన్సెక్స్ 323 పాయింట్లు డౌన్
స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్‌ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 323 పాయింట్లకుపైగా కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ 145 పాయింట్లు దిగజారింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- శ్రేయస్ టెస్టు అరంగేట్రం ఖరారు.. రహానె క్లారిటీ
టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్టు అరంగేట్రానికి(Shreyas Iyer Test debut) అంతా సిద్ధమైంది. గురువారం న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టులో శ్రేయస్‌ను తుదిజట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిపాడు కెప్టెన్ అజింక్యా రహానె. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆచార్య' అప్డేట్.. 'సిద్ధ' టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్
Acharyam movie teaser: మెగస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమా టీజర్‌ను నవంబరు 28న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.