ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అర్హత లేని వారిని డీజీపీగా నియమించారు: ఎంపీ రఘురామ

Raghurama letter to Union home miniser and UPSC Chairman: రాష్ట్రంలో సీనియర్‌ ర్యాంకు అధికారులను పక్కనపెట్టి.. అర్హత లేని వారిని డీజీపీగా నియమించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ మేరకు.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు.

MP Raghurama krishnaraju
ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Mar 2, 2022, 4:41 PM IST

Raghurama letter to Union home miniser and UPSC Chairman: కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, యూపీఎస్సీ ఛైర్మన్‌ ప్రదీప్​ కుమార్​ జోషి కి.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త డీజీపీ నియామకంపై.. లేఖలో ప్రస్తావించారు.

రాష్ట్రంలో సీనియర్‌ ర్యాంకు అధికారులను పక్కనపెట్టారన్న ఆయన.. అర్హత లేని వారిని డీజీపీగా నియమించారని పేర్కొన్నారు. యూపీఎస్సీ అనుమతితో డీజీపీ నియామకం చేపట్టాల్సి ఉందన్నారు. గౌతమ్‌ సవాంగ్‌ సహా ముగ్గురి పేర్లతో ప్రతిపాదనలు పంపేలా చూడాలని ఎంపీ రఘురామ లేఖ ద్వారా కోరారు.

ABOUT THE AUTHOR

...view details