ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొత్త కమిషనర్ వస్తారంతే!' - అంబటి రాంబాబు తాజా వార్తలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినట్లు అధికార వైకాపా నిర్థరించింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా రాజ్యాంగ బద్దంగానే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ అంశంపై విపక్షాలు గగ్గోలు పెట్టడం సరికాదని... వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.

Ysrcp_Mla_Ambati_Rambabu
'రాజ్యాంగ బద్దంగానే...ఎస్​ఈసీ పదవీ కాలం తగ్గింపు నిర్ణయం'

By

Published : Apr 10, 2020, 11:44 PM IST

Updated : Apr 11, 2020, 4:21 AM IST

'రాజ్యాంగ బద్దంగానే...ఎస్​ఈసీ పదవీ కాలం తగ్గింపు నిర్ణయం'

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని 5ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినట్లు వైకాపా తెలిపింది. ఆర్డినెన్స్ ప్రకారం ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీచ్యుతుడు అవుతాడని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్ధితుల్లో శాసనసభా సమావేశాలు నిర్వహించే పరిస్ధితి లేదని.. అందువల్లే ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్​కు సంబంధించి విధాన పరమైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని దీనిప్రకారమే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఇవీ చూడండి-'రమేశ్‌ పదవీకాలం ముగిసిన తర్వాతే అమలు చేయండి'

Last Updated : Apr 11, 2020, 4:21 AM IST

ABOUT THE AUTHOR

...view details