ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగండి: వైఎస్​ షర్మిల - తెలంగాణలో షర్మిల పార్టీ

తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డినే అడగాలని ఆయన సోదరి వైఎస్​ షర్మిల అన్నారు. వైకాపా నిర్మాణంలో కీలకంగా ఉండి పాదయాత్ర చేసిన మీకు పదవి ఎందుకు ఇవ్వలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షర్మిల స్పందించారు.

నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగండి: వైఎస్​ షర్మిల
నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగండి: వైఎస్​ షర్మిల

By

Published : Feb 25, 2021, 6:05 AM IST

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి తెలంగాణ అంటే నాకు గౌరవం, ప్రేమ లేదు అంటే ఎలా అని వైఎస్​ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలకు మేలు చేయాలని తనకు ఉందన్న షర్మిలా... ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి కూడా స్పష్టత ఇచ్చానని చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో షర్మిల విలేకర్లతో మాట్లాడారు. దేవుని చిత్తం వల్ల తెలంగాణ వచ్చిందని... దీనికి అందరూ లోబడాల్సిందే అని అన్నారు.

ఏపీలో చంద్రబాబు సర్కారు కంటే జగన్‌ ప్రభుత్వం బాగుందన్న షర్మిల... అక్కడ ప్రతిపక్షం కూడా బాగానే ఉందని.. ప్రశ్నిస్తోందని అన్నారు. అయితే తెలంగాణలో మాత్రం ప్రతిపక్షం లేదని ఆమె అన్నారు. పాదయాత్రపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయించలేదని షర్మిలా తెలిపారు. అయితే.. ఏదో ఒక కార్యక్రమం చేస్తానని... జనంలో ఉండాలన్నదే లక్ష్యమని చెప్పారు. అమరవీరులు తెచ్చుకున్న తెలంగాణ.. సంక్షేమ తెలంగాణ కావాలని షర్మిల ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:ప్రేమ తీసిన ప్రాణం.. నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య

ABOUT THE AUTHOR

...view details