విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన యువతి కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బయటికి వచ్చిన ఆధారాలతో నిందితుడు నాగేంద్రపై మాచవరం పోలీసులు మూడు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. యువతి చదివిన ఇంజినీరింగ్ కళాశాలలో వివరాలను సేకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో నిందితుడు చెబుతున్నట్లు పెళ్లి జరిగిందా..? లేదా అనే ఆధారాల కోసం పోలీసు బృందాలు ఆరా తీశాయి. హత్యకు ముందు యువతి, నాగేంద్రల మధ్య సాగిన సెల్ఫోన్ సంభాషణలను సేకరించే పనిలోపడ్డారు.
విజయవాడలో యువతి హత్య ఘటన.. దర్యాప్తు ముమ్మరం
ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన యువతి కేసులో ముమ్మర దర్యాప్తు సాగుతోంది. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో నిందితుడు చెబుతున్నట్లు పెళ్లి జరిగిందా..? లేదా అనే ఆధారాల కోసం దర్యాప్తు బృందాలు ఆరా తీశాయి. హత్యకు ముందు యువతి, నాగేంద్రల మధ్య జరిగిన సెల్ఫోన్ సంభాషణలను సేకరించే పనిలోపడ్డారు పోలీసులు.
ఇప్పటికే నిందితుడి తరపున ఏడుగురిని అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారణ చేసినట్లు సమాచారం. హత్యకు సంబంధించి నాగేంద్రకు ఎవరైనా సహాయపడ్డారా..? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. యువతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఆమె స్నేహితురాళ్లను, బంధువులను సైతం విచారించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 3,986 కరోనా కేసులు