ప్రభుత్వ భూములను వైకాపా నేతలకు చవకగా అమ్ముకుంటున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. నవరత్నాలు అమలులో ప్రభుత్వం విఫలమైందని స్పష్టమవుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు అమ్మకం అనే ప్రకటన కూడా త్వరలో చూస్తామని ఎద్దేవా చేశారు. అవి.. కేవలం వైకాపా కార్యకర్తలకు మాత్రమే అమ్ముకుంటారని దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో ప్రజా ఆస్తులన్నీ భద్రంగా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఉన్నది ప్రజల ఆస్తులు కాపాడేందుకని.. వాటిని భుజించటానికి కాదని హితవు పలికారు.
'త్వరలో ప్రభుత్వ కార్యాలయాల అమ్మకం అనే ప్రకటన చూస్తాం'
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తుగ్లక్ పరిపాలన వల్ల ఏ భూమి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడటం లేదని... మండిపడ్డారు.
yanamala on govt lands