మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా శక్తి టీం ను ఏర్పాటుచేసింది. మహిళలపై నేరాలను తగ్గించేందుకు ఈ ప్రత్యేక టీం ఉపయోగపడుతుంది. అన్నిప్రాంతాల్లో మహిళా శక్తి టీం వారిపై దాడులు జరిగితే ఎలా రక్షించుకోవాలి అనేదానిపై అవగాహన సదస్సు ఏర్పాటుచేసి మహిళల్లో చైతన్యం తెస్తున్నారు. సైబర్ క్రైంద్వారా కూడా జరుగుతున్న వేధింపులను తగ్గించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని డీజీపీ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా డీజీపీ కార్యాలయం ప్రాంగణంలో హెల్త్ క్యాంపును ఏర్పాటుచేశారు. మహిళా పోలీసులకు ఉచిత స్క్రీనింగ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ సతీమణి అమితా ఠాకూర్ హాజరయ్యారు. ఇటువంటి కార్యక్రమాలు మహిళలకోసం క్యాంపులు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా పోలీసులకుబహుమతులు ప్రధానం చేశారు.
మహిళలకు అండగా శక్తిటీమ్ - INTERNATIONAL WOMENS DAY
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. మహిళలపై దాడులు జరిగితే ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు.
dgp