విజయవాడ పటమటలో దారుణం చోటు చేసుకుంది. ఫన్ టైం క్లబ్ రోడ్డు లోని అపార్ట్మెంట్ నుంచి దూకి.. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతిచెందింది. మృతురాలు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న తమ్మల వసుంధరగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలు ఆరా తీస్తున్నారు.
అపార్ట్మెంట్ మీద నుంచి దూకి.. మహిళ ఆత్మహత్య - Woman commits suicide by jumping from apartment
విజయవాడ పటమటలో అపార్ట్మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి కారణాలు ఆరా తీస్తున్నారు.
అపార్ట్మెంట్ మీద నుంచి దూకి మహిళ ఆత్మహత్య
TAGGED:
vijayawada patamata