ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించడంతో అందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అధికారికంగా అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణ తేదిపై తర్జనభర్జనలు జరిగినప్పటికీ కేంద్ర హోంశాఖ సూచనల మేరకు నవంబర్ 1నే నిర్వహించాలని నిర్ణయించారు. విభజన చట్టంలోనూ ఏపీని రెసిడ్యూరీ స్టేట్‌గానే పేర్కొనడంతో ఇదే తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించటం సమంజసమని ప్రభుత్వం భావిస్తోంది.
ఆరేళ్ళ విరామం అనంతరం, రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న తొలి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. దీనికోసం సాధరణ పరిపాలన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.