ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రత్యేక హోదాపై ప్రస్తావనేది?: లంకా దినకర్​ - ycp

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా ప్రస్తావించకపోవటం బాధాకరమని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం, నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై మేనిఫెస్టోలో చెప్పకపోవడం శోచనీయమన్నారు.

తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్

By

Published : Apr 6, 2019, 8:23 PM IST

తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్

వైకాపా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకహోదాపై ప్రస్తావించకపోవటం బాధాకరమని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ఒకే ఒక్క ప్రభుత్వం తెదేపాది అని అన్నారు. మోదీ,కేసీఆర్ కనుసన్నల్లో జగన్ నడుసున్నారని ఆక్షేపించారు. పోలవరం, అమరావతిపై... వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొనకపోవటం శోచనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details