పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకట్రెండుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
కొనసాగుతున్న అల్పపీడనం.. రాష్ట్రానికి మరో 2 రోజులు వర్ష సూచన - ఏపీలో తాజా వాతావరణ నివేదిక
పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడే సూచనలున్నట్లు పేర్కొంది.
వాతావరణ నివేదిక
Last Updated : Oct 2, 2020, 5:17 PM IST