విజయవాడలో రాంగ్ పార్కింగ్ చేశారని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో ఓ మహిళను దురుసుగా ప్రవర్తించింది. బెంజ్ సర్కిల్‌కు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ మహిళ రోడ్డుపై కారును నిలిపింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాము... కారు చక్రానికి లాక్ వేశారు. మహిళ కారు వద్దకు వచ్చిన తర్వాత ఆమెను డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే.. ఇవ్వకపోగా కానిస్టేబుల్‌తో వాగ్వావాదానికి దిగింది. కానిస్టేబుల్ సెల్ ఫోన్‌ను ధ్వంసం చేసింది. వ్యవహారంపై... కానిస్టేబుల్ రాము స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశారు.
రాంగ్ పార్కింగ్‌ను ప్రశ్నించినందుకు... సెల్‌ఫోన్ పగలగొట్టేసింది! - ట్రాఫిక్
రాంగ్ పార్కింగ్ ఎందుకు చేశారని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను.. ఓ మహిళ నిలదీసింది. తన కారును ఎందుకు లాక్ చేశారంటూ ఎదురు ప్రశ్నించింది.
రాంగ్ పార్కింగ్‌ను ప్రశ్నిస్తే...సెల్‌ఫోన్ పగలగొట్టేశారు!