ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమాన సర్వీసులు - sankranthi latest news

సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరూ సొంతూళ్ల బాట పడతారు. ఇలా వచ్చే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి పోతాయి. పండుగకు ప్రత్యేక బస్సులు, రైళ్లు నడపడం ఇప్పటి వరకు చూశాం. తొలి సారి ప్రత్యేక విమానాలు సైతం నడపనున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారి కోసం విమానాయాన శాఖ అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.

vijayawada-to-hyderabad-special-aeroplane-services-by-spicejet
హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమాన సర్వీసులు

By

Published : Jan 4, 2021, 6:13 PM IST

సంక్రాంతి వచ్చిందంటే చాలు అన్ని దారులూ ఆంధ్రా వైపే పయనిస్తాయి. కోస్తాంధ్రలో కోడిపందేలు, పొట్టేలు పందేలు సహా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇలా పల్లెలన్నీ సంక్రాంతి శోభతో కళకళలాడుతాయి. ఇలా వచ్చే వారితో ఆర్టీసీ బస్సులన్నీ నిండిపోతాయి. దీంతో ప్రత్యేక బస్సులనూ ఏర్పాటు చేస్తారు. రైళ్లలోనూ అదే పరిస్ధితి ఉంటుంది. సంక్రాంతి పండుగకు డిమాండ్ ఉంటుందని భావించిన విమానయాన సంస్థలూ ఇదే బాట పట్టాయి. డిమాండ్​ను సొమ్ము చేసుకునేందుకు ప్రత్యేక విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

సంక్రాంతి పండుగకు తెలంగాణ, ఏపీ మధ్య ప్రత్యేక విమానాలు నడిపేందుకు స్పైస్ జెట్ సంస్ధ ముందుకు వచ్చింది. పండుగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ -విజయవాడ మధ్య 2 ప్రత్యేక విమానాలను స్పైస్ జెట్ సంస్ధ నడుపుతున్నట్లు తెలిపింది. జనవరి 10 నుంచి 31 వరకు ఈ ప్రత్యేక విమానాలు నడుపనున్నారు. ఈ నెల 10 నుంచి ‍ఒకటి, 14 నుంచి మరో ప్రత్యేక విమానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

స్పైస్‌జెట్‌ విమాన సర్వీసుల వివరాలు:

  • జనవరి 10 నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4.30కు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానం బయలు దేరుతుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్​కు ప్రత్యేక విమానం నడుస్తుంది.
  • జనవరి 14 నుంచి మరో ప్రత్యేక విమానం నడుపనున్నట్లు తెలిపిన స్పైస్ జెట్ సంస్ధ.. ఈ విమానం సమయ వేళల్ని త్వరలో తెలియజేయనున్నట్లు తెలిపింది. ప్రత్యేక విమానాల్లో అందుబాటు ధరల్లో టికెట్ ఛార్జీలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు.

త్వరలో ఇండిగో సర్వీసులు పునరుద్ధరణ

విజయవాడ- ముంబై మధ్య ఇండిగో విమాన సర్వీసులు త్వరలో పునరుద్దరణ చేయనున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. జనవరి 12 నుంచి వారానికి మూడు రోజులు విజయవాడ- ముంబై మధ్య ఇండిగో విమానాలు నడవనున్నట్లు తెలిపారు. మంగళ, గురు, శని వారాల్లో విజయవాడ -ముంబై మధ్య ఇండిగో విమాన సర్వీసులు నడుస్తాయన్నారు. వారణాసికి విమాన సర్వీసు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

నష్టాల్లో విశాఖ ఫిషింగ్ బోటు వ్యాపారులు

ABOUT THE AUTHOR

...view details