ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొరియర్ వ్యాపారానికి టాస్క్‌ఫోర్స్‌ చెక్..!? - vijayawada

విజయవాడ నగరంలో అక్రమంగా జరుగుతున్న బంగారం, వెండి వ్యాపారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకొని సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

కొరియర్ వ్యాపారానికి టాస్క్‌ఫోర్స్‌ చెక్

By

Published : May 1, 2019, 10:16 AM IST

ద్వారకా తిరుమలరావు

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరుగుతున్న బంగారం, వెండి అక్రమ వ్యాపారాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొవచ్చారు. ముంబై నుంచి కొరియర్‌ ద్వారా బంగారం, వెండి నగరానికి చేరుకుంటుంది. కొరియర్‌ ద్వారా వచ్చిన బంగారాన్ని స్థానిక వ్యాపారులు తీసుకుని దుకాణాల్లో విక్రయిస్తారు. బిల్లులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై... పోలీసులు నిఘాపెట్టారు. పక్కా సమాచారంతో... 1.8 కేజీల బంగారం, 40 కేజీల వెండి, 15 లక్షల నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details