ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారు : విజయవాడ అత్యాచార బాధిత కుటుంబం - విజయవాడ దిశ పోలీసులపై అత్యాచార బాధిత కుటుంబం ఫిర్యాదు

complaint on disha police: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు.. "దిశ" పోలీసులపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం న్యాయం చేసిందిగా ఇంకెందుకు రాద్ధాంతం అంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో దిశ పోలీసులపై ఫిర్యాదు చేశారు.

complaint
స్పందన కార్యక్రమంలో దిశ పోలీసులపై ఫిర్యాదు

By

Published : Apr 25, 2022, 3:06 PM IST

Updated : Apr 25, 2022, 3:13 PM IST

"ప్రభుత్వం న్యాయం చేసిందిగా ఇంకెందుకు రాద్ధాంతం చేస్తున్నారు" అంటూ "దిశ" పోలీసులు తమను బెదిరిస్తున్నారని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు కలెక్టర్‌ కార్యాలయం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. డబ్బులు ఇస్తే న్యాయం జరిగిపోయినట్లేనా? అని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. ఘటన తర్వాత అమ్మాయి ఫలానా చోట ఉంది తెచ్చుకోండి అన్నారే తప్ప, ఒక్క పోలీసూ సాయానికి రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదనే పోరాడుతున్నాం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్‌చేశారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ ఆ తల్లిదండ్రులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

దిశ పోలీసులపై బాధిత కుటుంబం ఫిర్యాదు
Last Updated : Apr 25, 2022, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details