ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రద్దైన విదేశీ కరెన్సీతో దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు

కేవలం రూ.45 లక్షలతో మీరు కోటీశ్వరుడు ఐపోవచ్చు...అంటూ టర్కీ దేశంలో రద్దైన నోట్లతో మోసం చేసేందుకు ప్రయత్నించిన కేటుగాళ్లను విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కోట్లు సంపాదించాలని నిందితులు వేసిన మాస్టర్ ప్లాన్​ను భగ్నం చేశారు.

By

Published : Oct 22, 2020, 8:44 PM IST

రద్దైన విదేశీ కరెన్సీతో దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు
రద్దైన విదేశీ కరెన్సీతో దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు

కేవలం రూ.45 లక్షల పెట్టుబడి పెట్టండి.. మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి అని అమాయకులకు వల విసిరిన కేటుగాళ్లు విజయవాడ పోలీసులకు చిక్కారు. టర్కీలో రద్దు చేసిన కరెన్సీ నోట్లు అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించాలని ప్లాన్​ చేసిన గాజుల పల్లి మనోహర్, గుర్రాల రవికుమార్ మరో ముగ్గురు స్నేహితులను కలుపుకుని విజయవాడలోని కొందరు వ్యాపారులను నమ్మించే ప్రయత్నం చేశారు.

ఈ విషయాన్ని పసిగట్టిన టాస్క్​ఫొర్స్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి మూడు వందల టర్కీ దేశం నోట్లను, ఒక కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విజయవాడ అజిత్ సింగర నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడులలో నగర అదనపు కమిషనర్ (టాస్క్​ఫోర్స్) శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :'హలో నేను పోలీస్​ను మాట్లాడుతున్నా.. మీ జుట్టు కత్తిరించుకోండి'

ABOUT THE AUTHOR

...view details