విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా... దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహా మంత్రాభినేతగా జగన్మాత దర్శనమిస్తున్నారు. అమ్మవారి దివ్య రూపాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కొవిడ్ నిబంధనల దృష్యా... గంటకు వెయ్యి మంది చొప్పున రోజుకు పదివేల మందికి మాత్రమే అధికారులు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, చండీ హోమం, శ్రీచక్ర వాహర్చణ తదితర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
లలితా త్రిపుర సుందరీ దేవిగా జగన్మాత - లలితా త్రిపుర సుందరీ దేవిగా విజయవాడ దుర్గమ్మ దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా... దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.
లలితా త్రిపుర సుందరీ దేవిగా జగన్మాత దర్శనం