నేడు 104, 108 నూతన వాహనాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి కొత్త వాహనాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో....ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకున్నట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించటంతో పాటు... ఏలూరు, విశాఖ వెళ్లే వాహనాలను అర్ధరాత్రి 12 నుంచి దారిమళ్లించనున్నారు. ఒంగోలు జిల్లా త్రోవగుంట నుంచి వాహనాల దారిమళ్లింపు ఉంటుంది. బాపట్ల, అవనిగడ్డ, గుడివాడ మీదుగా ఏలూరు వైపునకు మళ్లిస్తారు.
నేడు కొత్త అంబులెన్స్‌లు ప్రారంభించనున్న సీఎం... ట్రాఫిక్ మళ్లీంపుకు చర్యలు - cm jagan news
నేడు 104, 108 నూతన వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపుకు చర్యలు తీసుకున్నట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
విజయవాడ సీపీ శ్రీనివాసులు
ఇవాళ ఉదయం 4 నుంచి విజయవాడకు లారీలకు అనుమతి నిరాకరించినట్లు సీపీ తెలిపారు. ఏలూరు వైపు నుంచి విజయవాడ వచ్చే ఆర్టీసీ బస్సులను రామవరప్పాడు రింగ్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బస్టాండ్‌కు దారిమళ్లించనున్నారు.
Last Updated : Jul 1, 2020, 11:47 AM IST